వాహ‌న‌దారుల‌కు స‌ర్కార్ బిగ్ షాక్

Spread the love

చ‌లాన్లు క‌ట్ట‌క‌పోతే జ‌రిమానా త‌ప్ప‌దు

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌కు సంబంధించి వాహ‌న‌దారులు జాగ్ర‌త్త వ‌హించ‌క పోతే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఇక నుంచి ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్ లేదా ఆర్సీ సీజ్ అవుతుంద‌ని హెచ్చ‌రించింది. కొత్త నిబంధనలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. చలాన్ వచ్చిన 45 రోజుల్లో వాహనదారులు ఫిర్యాదు చేసి తమ అభ్యంతరాలను తెలిపేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది పోలీస్ యంత్రాంగం.

వాహనదారుడి ఫిర్యాదును పరిశీలించి, అధికారులు నిర్ణయం తీసుకున్నాక, ఆ నిర్ణయానికి అంగీకరిస్తే 30 రోజుల్లో చలాన్ కట్టాల్సి ఉంటుంది. లేదంటే 50% చలాన్ కట్టి కోర్టుకు వెళ్లొచ్చని, కోర్టుకు వెళ్లకపోతే చలాన్ కట్టడానికి 15 రోజులు గడువు ఇచ్చేవిధంగా నిబంధనలు అమలు చేసేలా ప్రణాళికకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఫిర్యాదు గురించి పూర్తి పరిష్కారం లభించినా కూడా చలాన్ కట్టకపోతే లైసెన్స్, ఆర్సీ సీజ్ అవ్వడమే కాకుండా, వాహనానికి సంబంధించిన అన్ని ఆర్టీఏ సేవలు డీ–యాక్టివేట్ అయ్యేలా, చలాన్ చెల్లిస్తేనే ఆర్టీఏ సేవలు తిరిగి యాక్టివేట్ అయ్యేలా నిబంధనలు తీసుకు రానుంది. ఈ అంశంపై త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న పోలీస్ శాఖ .

  • Related Posts

    రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా ప‌థ‌కం

    Spread the love

    Spread the loveశాస‌న స‌భ‌లో ప్ర‌క‌టించిన ఉప ముఖ్య‌మంత్రి హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. శుక్ర‌వారం రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శాస‌న స‌భ‌లో బ‌డ్జెట్ 2026-27ను ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా గోదావ‌రి పుష్క‌రాల‌కు రూ. 500…

    గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భ‌ట్టి

    Spread the love

    Spread the loveశాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన డిప్యూటీ సీఎం హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు శాస‌న స‌భ సాక్షిగా. పుష్కరాల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *