newsseals.com
News

దేవుడు శాసిస్తాడు జీవన్ రెడ్డి పాటిస్తాడు

VijayaBhaskar March 22, 2026
newsseals-JeevanReddy
Spread the love

మాజీ మంత్రి సీరియ‌స్ కామెంట్స్ వైర‌ల్

క‌రీంన‌గ‌ర్ జిల్లా : మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . త‌ను గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ సంద‌ర్బంగా త‌న‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేశారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్. వారు స్వ‌యంగా జీవ‌న్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేర‌కు జీవ‌న్ రెడ్డిని క‌లిశారు. త‌న‌కు పార్టీలో అత్యంత ముఖ్య‌మైన ప‌ద‌విని ఇచ్చే ఆలోచ‌న‌లో ఉంద‌ని తెలిపారు. ఆయ‌న‌కు అపార‌మైన అనుభ‌వం ఉంద‌ని, త‌న సేవ‌లు పార్టీకి అత్యంత అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్బంగా జీవ‌న్ రెడ్డి మంత్రులు త‌న‌ను క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. దేవుడు శాసిస్తాడు జీవ‌న్ రెడ్డి పాటిస్తాడ‌ని, త‌న నిర్ణ‌యంలో ఎలాంటి మార్పు లేద‌ని స్ప‌ష్టం చేశాడు. కొంద‌రు గ‌త కొంత‌కాలంగా త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌చ్చార‌ని, ఇక ఆత్మ గౌర‌వం చంపుకుని పార్టీలో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అందుకే త‌ను కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాన‌ని తెలిపారు. దీన్ని బట్టి మంత్రుల చర్చలు విఫలమైనట్లుగా అందరూ అభిప్రాయ పడుతున్నారు.. పార్టీని వీడే విషయంలో జీవన్ రెడ్డి నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తేలిపోయింది.