సంజు సామ్సన్ నాకు ప్రేర‌ణ : జితేష్ శ‌ర్మ‌

Spread the love

త‌న ఆట‌తీరు, వ్య‌క్తిత్వం అద్బుతం

ముంబై : ప్ర‌ముఖ క్రికెట‌ర్ జితేష్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను ఇప్పుడు ఈ ఏడాది జ‌రిగే ఐపీఎల్ టోర్నీపై ఫోక‌స్ పెట్ట‌నున్నాడు. ప్ర‌త్రి క్రికెట‌ర్ కు ఎప్పుడో ఒకప్పుడు ఛాన్స్ వ‌స్తుంద‌న్నాడు. ఒక్కోసారి ప్ర‌శంస‌లు ద‌క్కుతాయి. మ‌రోసారి విమ‌ర్శ‌లు ప‌ల‌క‌రిస్తాయి. ఇది స‌ర్వ సాధార‌ణ‌మేన‌ని పేర్కొన్నాడు. ఇవాళ జితేష్ శ‌ర్మ మీడియాతో మాట్లాడాడు. తన లాంటి క్రికెట‌ర్ల‌కు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్ నిత్యం ప్రేర‌ణ‌గా నిలుస్తాడాని ప్ర‌శంస‌లు కురిపించాడు. త‌న ఆట‌తీరు డిఫ‌రెంట్ గా ఉంటుంద‌న్నాడు. క్రికెట్ కు సంబంధించిన క‌ళాత్మ‌క‌మైన షాట్స్ అన్నీ త‌ను ఆడే స‌మ‌యంలో చూసేందుకు వీలు క‌లుగుతుంద‌ని పేర్కొన్నాడు జితేష్ శ‌ర్మ‌.

త‌న 11 ఏళ్ల కెరీర్ లో అత్యుత్త‌మమైన ప్ర‌దర్శ‌నను నాతో పాటు కోట్లాది మంది ఈసారి జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో చూశామ‌న్నాడు. త‌ను గ‌నుక ఆడ‌క పోయి ఉండి ఉంటే ఇండియా విశ్వ విజేత‌గా నిలిచి ఉండేది కాద‌న్నాడు. త‌ను అనూహ్యంగా తొల‌గించ‌బ‌డ్డాడు. చివ‌ర‌కు అదృష్టం త‌లుపు త‌ట్టింది. త‌ను వ‌చ్చిన ఛాన్స్ ను మిస్ చేసుకోలేదు. త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. టోర్నమెంట్ లో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. త‌ను కేవ‌లం 5 ఇన్సింగ్స్ లు ఆడాడు. ఇందులో 22, 24, 97 , 89, 89 ఉన్నాయి. మొత్తం 200 స్ట్రైక్ రేటుతో 321 ర‌న్స్ సాధించ‌డం మామూలు విష‌యం కాద‌న్నాడు జితేష్ శ‌ర్మ‌.

  • Related Posts

    టి20 జ‌ట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?

    Spread the love

    Spread the loveకెప్టెన్ గా సూర్య కుమార్ యాద‌వ్ కంటిన్యూ ముంబై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టి20 జ‌ట్టును ప్ర‌క‌టించే ప‌నిలో ప‌డింది. ఇప్ప‌టికే ఆ జ‌ట్టును ముందుండి న‌డిపిస్తున్నాడు సూర్య కుమార్ యాద‌వ్. త‌న సార‌థ్యంలో…

    అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్

    Spread the love

    Spread the love46 బాల్స్ 7 ఫోర్లు 3 సిక్సులు 71 ర‌న్స్ రాయ్ పూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో యంగ్ క్రికెట‌ర్లు స‌త్తా చాటుతున్నారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన వైభ‌వ్ సూర్య వంశీ, చెన్నై సూపర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *