ఐపీఎల్ ట్రోఫీ గెల‌వ‌డం నా ల‌క్ష్యం

Spread the love

షాకింగ్ కామెంట్స్ చేసిన హార్దిక్ పాండ్యా

ముంబై : ఈ ఏడాదిలో జ‌ర‌గ‌బోయే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌, అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఐపీఎల్ ట్రోఫీని గెల‌వ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు ముంబై ఇండియ‌న్స్ కెప్ట‌న్ హార్దిక్ పాండ్యా. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడాడు. ఈనెల 28 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 10 జ‌ట్లు పాల్గొంటున్నాయి. ఈసారి త‌మ ల‌క్ష్యం ఒక్క‌టేన‌ని, అది ఐపీఎల్ ను కైవ‌సం చేసుకోవ‌డం పైనే ఫోక‌స్ పెట్టామ‌న్నారు. ఇది నా ముందున్న స‌వాల్ అని పేర్కొన్నాడు హార్దిక్ పాండ్యా.

ముంబై ఇండియన్స్ తరఫున ఆరోసారి ఐపీఎల్ గెలవడమే నా అంతిమ కల. ముంబై ఇండియన్స్‌కు ఇప్పటికే అద్భుతమైన వారసత్వం ఉందన్నాడు. కానీ నేను కొత్త కుర్రాడిగా వచ్చినప్పుడు, జట్టులోని అభిరుచి, కఠోర శ్రమ, మొత్తం జట్టు నాకు అందించిన మద్దతు నాకు ఇంకా గుర్తుందని చెప్పాడు పాండ్యా. ప్రజలు ముందుకు వచ్చి, కష్టపడి, అత్యుత్తమ క్రికెట్ ఆడే సంస్కృతి కొనసాగాలని నేను కోరుకుంటున్నానని తెలిపాడు. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన అత్యుత్తమ క్రికెట్‌కు మేము ప్రాతినిధ్యం వహించాలని తాను ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు కెప్టెన్.

  • Related Posts

    సంజు సామ్సన్ నాకు ప్రేర‌ణ : జితేష్ శ‌ర్మ‌

    Spread the love

    Spread the loveత‌న ఆట‌తీరు, వ్య‌క్తిత్వం అద్బుతం ముంబై : ప్ర‌ముఖ క్రికెట‌ర్ జితేష్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను ఇప్పుడు ఈ ఏడాది జ‌రిగే ఐపీఎల్ టోర్నీపై ఫోక‌స్ పెట్ట‌నున్నాడు. ప్ర‌త్రి క్రికెట‌ర్ కు ఎప్పుడో ఒకప్పుడు ఛాన్స్…

    రిషబ్ పంత్ ను వ్య‌తిరేకించినా ఎంపిక చేశా

    Spread the love

    Spread the loveమాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్ట‌ర్ ఎంఎస్కే ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను రిష‌బ్ పంత్ ఎంపిక‌పై గ‌తంలో చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి ప్ర‌త్యేకంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *