జీవ‌న్ రెడ్డిని బుజ్జ‌గించిన టీపీసీసీ చీఫ్

Spread the love

త‌న‌ను క‌లిసిన విప్ ఆది శ్రీ‌నివాస్

క‌రీంన‌గ‌ర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ , విప్ ఆది శ్రీ‌నివాస్. ఆయ‌న గ‌త కొంత కాలంగా పార్టీ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం ప‌ని చేస్తూ వ‌చ్చిన త‌న ప‌ట్ల ఇంత అవ‌మాన‌క‌రంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల ఆవేద‌న చెందారు. దీంతో పార్టీ మారాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌ను పార్టీలోనే ఉండాల‌ని ప‌లువురు నేత‌లు, మంత్రులు కోరారు. కానీ స‌సేమిరా అన్నారు. మంగ‌ళ‌వారం టీపీసీసీ చీఫ్ , విప్ లు స్వ‌యంగా జీవ‌న్ రెడ్డి నివాసానికి వ‌చ్చారు. పార్టీ ప‌రంగా మంచి ప‌ద‌వి వ‌స్తుంద‌ని, వేచి చూడాల‌ని, ఆవేశ ప‌డ‌వ‌ద్ద‌ని, పార్టీని వీడ‌వ‌ద్ద‌ని కోరారు టీపీసీసీ చీఫ్‌.

పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్ప‌డింది. 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో చాలా ఇబ్బంది పడ్డానని, కార్యకర్తల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని జీవన్ రెడ్డి తెలిపాడు. రాజీనామా చేయడనే ఆశతో వెళ్తున్నామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు. ఇదిలా ఉండ‌గా
మహేష్ కుమార్ గౌడ్ వెళ్లగానే బయటికి వచ్చిన జీవ‌న్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రేపటి సమావేశం యధావిధిగా కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    కాముని చెరువు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాలి

    Spread the love

    Spread the loveఆదేశించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : మూసాపేట‌లోని కాముని చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంద‌ర్శించారు. రెండో విడ‌త చేప‌డుతున్న 14 చెరువుల్లో కాముని చెరువు కూడా ఉంద‌నే విష‌యం విధిత‌మే. ఈ చెరువు…

    ఎంఐఎం చీఫ్ నాకు మంచి మిత్రుడు

    Spread the love

    Spread the loveకేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ ఓవైసీ (అసదుద్దీన్) తో గ‌త కొన్నేళ్లుగా స్నేహం ఉంద‌న్నాడు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *