Friday, 16 October 2026

ఎంఐఎం చీఫ్ నాకు మంచి మిత్రుడు

newsseals-RamdasAthawale

కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే

ఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ ఓవైసీ (అసదుద్దీన్) తో గ‌త కొన్నేళ్లుగా స్నేహం ఉంద‌న్నాడు. అంతేకాక మాకు ఒక మంచి మిత్రుడు కూడా అని తెలిపాడు. ముస్లిం సమాజంలో తన పార్టీ ప్రభావాన్ని విస్తరించడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకుంటే, అది ఖచ్చితంగా స్వాగతించదగిన పరిణామం అన్నారు రామ్ దాస్ అథ‌వాలే. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి రాజకీయ పార్టీకీ ఉంటుందన్నారు.

అయితే, నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రజలు స్పష్టంగా నిర్ణయించుకున్నారని ఆశాభావం వ్య‌క్తం చేశారు కేంద్ర మంత్రి. గ‌త కొన్నేళ్లుగా అక్క‌డ రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. అందుకే జ‌నం మార్పును కోరుకుంటున్న‌ట్లు చెప్పారు . ప్ర‌జ‌ల తీర్పు స్ప‌ష్టంగా ఉంద‌ని, దీనిని ఎవ‌రూ మార్చ‌లేర‌ని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ఇప్ప‌టికే అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశారంటూ ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీఎంసీ స‌ర్కార్ ను, సీఎం దీదీని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *