దురంధ‌ర్ -2 స‌క్సెస్ ఆర్జీవీ కామెంట్స్

Spread the love

ఇదంతా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌వ‌ల్లే సాధ్యం

ముంబై : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన దురంధ‌ర్ -2 మూవీ దుమ్ము రేపుతోంది. కాసుల పంట పండిస్తోంది. ప్ర‌త్యేకించి పాకిస్తాన్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. అక్క‌డి స‌ర్కార్ తో పాటు ఇత‌ర ముస్లిం దేశాలు సైతం భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాయి. ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ త‌రుణంలో సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు, న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు సైతం దురంధ‌ర్ -2 ది రివెంజ్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ సినిమా అద్బుతంగా ఉందంటూ పేర్కొన్నారు.

దురంధ‌ర్ -2 మూవీని తెర‌పై చూశాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. త‌న‌ను ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్, భార్య కూడా క‌లుసుకుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు . త‌ను సామాన్యంగా ఏకి పారేస్తాడు కానీ ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. ధురంధర్‌ను కేవలం ఒక సినిమా అని పిలవడం దానికి అన్యాయం చేయడమే అవుతుందన్నాడు. దర్శకుడు ఆదిత్య ధర్ నుండి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ సినిమా ప్రభావం చాలా భారీగా ఉంది. ‘ధురంధర్ 2’ ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. భారతీయ సినిమాకు ఒక కొత్త మార్గాన్ని చూపించినందుకు ఆదిత్య ధర్‌కు అభినంద‌న‌లు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు ఆర్జీవీ.

  • Related Posts

    సీఎం జోసెఫ్ విజ‌య్ డ్యాన్స్ వీడియో వైర‌ల్

    Spread the love

    Spread the loveత్వ‌ర‌లో రిలీజ్ కానున్న జ‌న నాయ‌గ‌న్ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రానికి నూత‌న సీఎంగా ఎన్నికైన ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖర్ ఇప్పుడు వైర‌ల్ గా మారారు. త‌ను చివ‌రిసారిగా న‌టించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రంలో భాగంగా సింగ‌పూర్…

    త‌మిళ‌నాడు భూమి పుత్రుడు జోసెఫ్ విజ‌య్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన న‌టి స‌న‌మ్ శెట్టి చెన్నై: జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. తమిళ నటి సనమ్ శెట్టి ఇలా అన్నారు. ఈ రోజు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *