కంపెనీల ఏర్పాటులో ఏపీ స్టేట్ రికార్డ్

Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్

అన‌కాప‌ల్లి : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్రబాబు స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం కార‌ణంగా ఏపీకి భారీ ఎత్తున కంపెనీలు వచ్చాయ‌ని అన్నారు. ఇందుకు నిద‌ర్శ‌న‌మే ఇవాళ ప్రారంభించిన కంపెనీ అని అన్నారు. ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించి, రికార్డు సమయంలో ప్రాజెక్టులు మొదలుపెట్టే మా సామర్థ్యానికి ఇది మచ్చుతునక అని పేర్కొన్నారు. ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్ మా రాష్ట్రానికి వస్తున్న ముఖ్య ప్రాజెక్టుల్లో ఒకటి. లేటెస్ట్ టెక్నాలజీ, హై-గ్రేడ్ స్టీల్‌పై స్పెషలైజేషన్ తో ఈ ప్రాజెక్ట్ అనకాపల్లిని ప్రపంచ మ్యాప్‌లో పెడుతుంది. ఏఏంఎన్ఎస్ గ్రీన్ స్టీల్ ప్లాంట్‌ను గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ టెక్నాలజీలతో అభివృద్ధి చేస్తున్నందుకు సంతోషంగా ఉంద‌న్నాడు.

ఈ ప్రాజెక్ట్‌లో మేం సాధించిన కొన్ని టైమ్‌లైన్‌లు చెప్పాలన్నారు నారా లోకేష్‌. సెప్టెంబర్ 2024లో అదిత్యతో మొదటి జూమ్ కాల్. 2 నెలల్లో ప్రాజెక్టు, ఇన్సెంటివ్స్ అప్రూవ్. 3 నెలల్లో భూమి ఇచ్చాం. ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్ క్లియరెన్స్ 11 నెలల్లో వచ్చాయని తెలిపాడు నారా లోకేష్‌. ఇవి ప్రపంచ స్థాయి టైమ్‌లైన్‌లు – ఇది రికార్డు స్థాయి బిజినెస్ వేగం. భారతదేశంలో ఇంతటి భారీ స్కేల్ ప్రాజెక్టును అత్యంత వేగంగా సాధించినందుకు గర్వంగా ఉందన్నాడు. ఇది 17.8 MMTPA ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, ₹1.35 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్, లక్ష ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, ప్లస్ క్యాప్టివ్ పోర్ట్‌తో అదనంగా రూ.11వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్ వ‌చ్చింద‌న్నాడు.

  • Related Posts

    కార్పొరేట్ కంపెనీల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

    Spread the love

    Spread the loveఅనుమతులు వేగంగా ఇస్తామ‌న్న సీఎం బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, కార్పొరేట్ కంపెనీల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. భారీ ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తే త్వ‌ర‌గా అనుమ‌తులు ఇచ్చి…

    పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో ఏపీ టాప్

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు హైద‌రాబాద్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఐఎస్బీ స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి పాల‌నా కాలంలో ఏపీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *