మార్కాపురం బ‌స్సు ప్ర‌మాదం బాధాక‌రం

Spread the love

సంతాపం వ్య‌క్తం చేసిన మంత్రి గొట్టిపాటి

అమ‌రావ‌తి : మార్కాపురం జిల్లా రాయ‌వ‌రం వ‌ద్ద గురువారం తెల్ల‌వారుజామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో నిర్మ‌ల్ నుంచి నెల్లూరు జిల్లాకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సును అతి వేగంగా వ‌స్తున్న టిప్ప‌ర్ ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల‌లో మంట‌లు చెల‌రేగాయి. బ‌స్సులో ప్ర‌యాణం చేస్తున్న వారిలో 14 మంది ప్ర‌యాణీకులు సజీవ ద‌హ‌నం అయ్యారని ప్రాథ‌మిక స‌మాచారం. ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఉన్న‌తాధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు. ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ప‌ట్ల మంత్రులు గొట్టిపాటి ర‌వికుమార్, నారా లోకేష్ లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రమాద ఘటన పై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. ప్రమాద వివరాలను మంత్రి గొట్టిపాటికి వివరించారు అధికారులు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బస్సులో ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ హామీ ఇచ్చారు.

  • Related Posts

    నీటి పారుద‌ల వ్య‌వ‌స్థను బ‌లోపేతం చేయాలి

    Spread the love

    Spread the loveచ‌ర్య‌లు తీసుకోవాల‌న్న బండారు శ్రావ‌ణి శ్రీ‌ అనంత‌పురం జిల్లా : శిoగనమల నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. నియోజకవర్గంలోని మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ (MPSC) ,…

    మార్కాపురం బ‌స్సు ప్రమాదం సీఎం సంతాపం

    Spread the love

    Spread the loveక్ష‌త‌గాత్రుల‌కు వైద్య సాయం అందించాలి మార్కాపురం జిల్లా : రాయవరం వద్ద గురువార తెల్ల‌వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచి వేసింద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. టిప్పర్- ప్రైవేటు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *