స‌ముద్ర విహారాన్ని ప్రోత్స‌హించేలా చూడాలి

Spread the love

కీల‌క ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు ఏపీ ప‌ర్యాట‌క రంగంపై.
సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా విశాఖ, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను కూడా నిర్వహించేలా చూడాలన్నారు. తెలంగాణా లాంటి ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు దీనికి పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతారన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే టెంట్ సిటీలను కేటగిరీలుగా విభిజించి ప్రోత్సహిస్తే అందరికీ అందుబాటులోకి వస్తాయన్నారు సీఎం. కనీసం వెయ్యి టెంట్ సిటీలను గోదావరి పుష్కరాల నాటికి అందుబాటులోకి తేవాలని సీఎం సూచనలు జారీ చేశారు. క్రియేటివ్ ఎకనామినీ ప్రోత్సహించేందుకు కంటెంట్ క్రియేషన్ పెద్ద ఎత్తున జరగాలన్నారు. క్రియేటివ్ ఎకానమీని సృష్టించేలా అమరావతి క్రియేటివ్ సిటీగా ఎదగాలన్నారు.

బాలివుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా క్రియేటివ్ ఎకనామీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఐకానిక్ డెస్టినేషన్ స్కీమ్ కింద విశాఖ, తిరుపతి నగరాలను అభివృద్ధి చేయాలని.. ప్రతీ ఐకానిక్ డెస్టినేషన్ కు రూ.500 కోట్ల వరకూ వెచ్చించేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గత ఏడాదిలో పర్యాటక ప్రాంతాలకు 30.92 కోట్ల మంది పర్యాటకుల ఫుట్ ఫాల్ నమోదైందని ఈ ఏడాదిలో 9 నెలల కాలానికి గానూ 21 శాతం మేర వృద్ధి కనిపించిందని.. ఇది మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన ఆలయాలను అనుసంధానించి టెంపుల్ టూరిజం కూడా ఇంటిగ్రేట్ చేయాలని సీఎం సూచించారు. సూర్యలంక బీచ్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలన్నారు. వీటితో పాటు తిరుపతిలో ఉన్న చెరువులు, అమరావతి ప్రాంతంలోని కాలువలు, విశాఖ సహా వేర్వేరు ప్రాంతాలను సుందరీకరణ చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.

  • Related Posts

    వ్య‌క్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్ న్యూఢిల్లీ : కేర‌ళ‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌దుప‌రి సీఎంగా వీడీ స‌తీశ‌న్ ను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఖ‌ర్గే. దీంతో నిన్న‌టి దాకా సీఎం…

    రేపే 12 ప్రాజెక్టుల‌కు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాప‌న‌

    Spread the love

    Spread the loveఇక నుంచి రాయ‌ల‌సీమ రక్ష‌ణ సీమ అమ‌రావ‌తి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్ర‌వారం రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *