వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు

Spread the love

ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపిన కేబినెట్

అమరావతి: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా సాకారం చేస్తున్నారు యువనేత నారా లోకేష్. తాము కులవృత్తి చేసుకుని జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు ఇవ్వాల్సిందిగా పాదయాత్ర సమయంలో వడ్డెర సోదరులు మంత్రి లోకేష్ కు విన్నవించారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం వడ్డెరలకు మైనింగ్ లీజులు కేటాయించే అంశాన్ని మంత్రి లోకేష్ తాజాగా కేబినెట్ ముందుకు తెచ్చారు. వడ్డెర సోదరుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను పెంచడానికి వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి విధివిధానాలతో త్వరలోనే ప్రభుత్వం జీవో జారీ చేయనుంది.

యువగళం పాదయాత్ర సమయంలో యువనేత లోకేష్ ప్రతిరోజూ వివిధ సామాజిక వర్గాల ప్రజలతో సమావేశమై వారి మనోగతాన్ని తెలుసుకున్నారు. ఆ సమయంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మాట నిలబెట్టు కుంటున్నారు. గత వైసీపీ వివిధ సామాజికవర్గాలను కేవలం ఎన్నికల్లో ఓట్లకోసం మాత్రమే ఉపయోగించుకొని, అవసరం తీరాక గాలికొదిలేసింది. అటువంటి ఓటుబ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలుకుతూ వివిధ సామాజిక వర్గాల మనోభీష్టాన్ని నెరవేరుస్తున్నారు రాష్ట్రమంత్రి, యువనేత నారా లోకేష్.

  • Related Posts

    బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది

    Spread the love

    Spread the loveరాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత మార్కాపురం జిల్లా : మార్కాపురం జిల్లా అనిత మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని…

    కోటి 15 ల‌క్ష‌ల కుటుంబాల‌కు జీవిత బీమా

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి 15 ల‌క్ష‌ల కుటుంబాల‌కు జీవిత బీమా స‌దుపాయం క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. గురువారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *