హ్యాపీ బ‌ర్త్ డే గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్

VijayaBhaskar · March 27, 2026
Spread the love

బుచ్చిబాబు స‌న మూవీ పెద్ది గ్లింప్స్ రిలీజ్

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు , న‌టుడు రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు ఇవాళ‌. మార్చి 27వ తదీ బ‌ర్త్ డే సంద‌ర్బంగా సినీ, రాజ‌కీయ‌, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌న‌కు విషెస్ తెలిపారు. త‌ను మొద‌టిసారిగా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ త‌ర్వాత ఒక్కో సినిమా చేసుకుంటూ గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగాడు. తొలుత త‌న‌ను గేలి చేశారు. న‌టుడిగా వ‌ర్క‌వుట్ కాద‌న్నారు. కానీ త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు రామ్ చ‌ర‌ణ్ . విచిత్రం ఏమిటంటే ముక్కు బాలేదు.. ముఖం బాలేదు..అని ఎగతాళి చేసిన రోజుల్లోంచి ప్రపంచమే నిలబడి చప్పట్లు కొట్టే స్థాయికి ఎదిగిన కథానాయకుడు రామ్ చరణ్ తేజ్

“మెగా” అనే రెండు అక్షరాల లెగసీని మోయడం మాటలు కాదు.. ఆ బరువును భుజానికెత్తుకుని వెండితెరపై తనని తాను చెక్కుకున్న చరణ్‌ని చూసి చిరంజీవే గర్వంతో పొంగి పోతున్నారు! డాన్స్‌లో గ్రేస్.. యాక్షన్‌లో పవర్.. ఎమోషన్‌లో క్లాస్.. ఈ మూడు కలిస్తే… ఒక సంచలనం! ఒకప్పుడు.. వారసత్వం అన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని మెప్పించిన గ్లోబల్ స్టార్ . అభిమానుల గుండెల్లో కొలువైన మెగా పవర్ స్టార్ . ఒక్కో విమర్శను ఒక్కో మెట్టుగా మార్చుకుని, ఎదుగుదలకి మార్గం వేసుకున్న ‘పెద్ది’కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేస్తోంది న్యూస్ సీల్స్ యాజ‌మాన్యం.