newsseals.com
News

గులాబీ నేత‌ల‌పై ఖాకీల అక్ర‌మ కేసులు

VijayaBhaskar March 27, 2026
newsseals-Harishrao
Spread the love

మండిప‌డ్డ మాజీ మంత్రి హ‌రీష్ రావు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు శాస‌న స‌భ వేదిక‌గా రాష్ట్ర స‌ర్కార్ నిర్వాకంపై మండిప‌డ్డారు. ప్ర‌ధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక త‌మ పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వేధింపుల‌కు పాల్ప‌డ‌డం దారుణ‌మ‌న్నారు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు న‌మోదు చేస్తున్నార‌ని ఆరోపించారు . ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని, కేవ‌లం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారినే అందలం ఎక్కిస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ్య‌తిరేకంగా చిన్న ట్వీట్ చేసినా కేసు న‌మోదు చేయ‌డం ప‌రిపాటిగా మారింద‌న్నారు.

నల్ల బాలు అనే వ్యక్తి రీట్వీట్ చేస్తే 3 కేసులు పెట్టి 20 రోజులు జైలులో పెట్టారని, హై కోర్టు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా కేసులు పెడుతూ ఉన్నారని ఫైర్ అయ్యారు హ‌రీశ్ రావు. కొణతం దిలీప్ మీద 40 FIRలు న‌మోదు చేశారు. ఇక క్రిశాంక్ మీద 26 కేసులు కేటీఆర్ మీద 3 కేసులు న‌మోదు చేశార‌ని ఆరోపించారు. సోషల్ మీడియాలో రీట్వీట్ చేసినందుకే ఇలా కేసులో పెడుతున్నారు అంటే ఇవాళ మన పోలీసులు ఎటువైపు పని చేస్తున్నారో అర్థం చేసుకోవాల‌న్నారు.