కోచ్ గా అవ‌తారం ఎత్తిన హ‌ర్భ‌జ‌న్ సింగ్

Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన భార‌త క్రిక‌ట్ బోర్డు

ముంబై : భార‌త మాజీ క్రికెట‌ర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచ‌ల‌నంగా మారాడు. త‌ను గ‌త కొంత కాలంగా కామెంటేట‌ర్ గా, విశ్లేష‌కుడిగా , రాజ‌కీయ నాయ‌కుడిగా ప‌లు పాత్ర‌లు పోషిస్తూ వ‌స్తున్నాడు. తాజాగా త‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా త‌ర‌పున స్పిన్న‌ర్ గా త‌ను విశిష్ట సేవ‌లు అందించాడు. ప‌లు కీల‌క‌మైన మ్యాచ్ ల‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ స‌మయంలో త‌న‌ను గుర్తించి గౌర‌వించింది ఎంపీ సీటు ఇచ్చింది ఆప్. తాజాగా త‌ను ఎంపీగానే కాకుండా మ‌రో కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టాడు సింగ్.

BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హై పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ గ్రూప్‌కు చెందిన ఆఫ్ స్పిన్నర్లతో , ఎమర్జింగ్ ఆఫ్ స్పిన్నర్లతో కలిసి పనిచేశారు. సాంకేతిక పరిజ్ఞానం నుండి వ్యూహాత్మక ప్రణాళిక వరకు, వివిధ దృశ్యాలు, పరిస్థితులను అనుకరించడం ద్వారా చర్చించిన పలు అంశాలపై ఆ దిగ్గజం నుండే నేరుగా దృక్కోణాలను పొందిన ఈ సెషన్‌లు పాల్గొనే వారికి ఎంతో విలువైనవిగా నిలిచాయి.

  • Related Posts

    నేనేమీ నిరూపించు కోవాల్సిన అవ‌స‌రం లేదు

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శుభ్ మ‌న్ గిల్ ముంబై : భార‌త టెస్టు, వ‌న్డే ఫార్మాట్ ల జ‌ట్ల స్కిప్ప‌ర్ శుభ్ మ‌న్ గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. రేప‌టి నుంచి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్…

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓన‌ర్ కు జాక్ పాట్

    Spread the love

    Spread the loveభారీ ధ‌ర‌కు అమ్ముడు పోయిన ఐపీఎల్ టీం రాజ‌స్థాన్ : భారతీయ క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయి చ‌రిత్ర సృష్టించింది ఐపీఎల్ టీం రాజ‌స్థాన్ రాయ‌ల్స్. సంస్థ య‌జ‌మాని మ‌నోజ్ బ‌దాలేకు పంట పండింది. ఒక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *