కోచ్ గా అవ‌తారం ఎత్తిన హ‌ర్భ‌జ‌న్ సింగ్

VijayaBhaskar · March 27, 2026
Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన భార‌త క్రిక‌ట్ బోర్డు

ముంబై : భార‌త మాజీ క్రికెట‌ర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచ‌ల‌నంగా మారాడు. త‌ను గ‌త కొంత కాలంగా కామెంటేట‌ర్ గా, విశ్లేష‌కుడిగా , రాజ‌కీయ నాయ‌కుడిగా ప‌లు పాత్ర‌లు పోషిస్తూ వ‌స్తున్నాడు. తాజాగా త‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా త‌ర‌పున స్పిన్న‌ర్ గా త‌ను విశిష్ట సేవ‌లు అందించాడు. ప‌లు కీల‌క‌మైన మ్యాచ్ ల‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ స‌మయంలో త‌న‌ను గుర్తించి గౌర‌వించింది ఎంపీ సీటు ఇచ్చింది ఆప్. తాజాగా త‌ను ఎంపీగానే కాకుండా మ‌రో కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టాడు సింగ్.

BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హై పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ గ్రూప్‌కు చెందిన ఆఫ్ స్పిన్నర్లతో , ఎమర్జింగ్ ఆఫ్ స్పిన్నర్లతో కలిసి పనిచేశారు. సాంకేతిక పరిజ్ఞానం నుండి వ్యూహాత్మక ప్రణాళిక వరకు, వివిధ దృశ్యాలు, పరిస్థితులను అనుకరించడం ద్వారా చర్చించిన పలు అంశాలపై ఆ దిగ్గజం నుండే నేరుగా దృక్కోణాలను పొందిన ఈ సెషన్‌లు పాల్గొనే వారికి ఎంతో విలువైనవిగా నిలిచాయి.