ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ఆడటం అద్బుతం

Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్

గుజ‌రాత్ : ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ , ఇంగ్లండ్ కు చెందిన జోస్ బ‌ట్ల‌ర్ . మార్చి 28 నుంచి ప్రపంచంలోనే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందింది ఈ మెగా టోర్న‌మెంట్. ఇందులో మొత్తం 10 జట్లు ఆడ‌తాయి. గ‌త కొన్నేళ్లుగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ఆడాడు. ఇక్క‌డ కీ రోల్ పోషించిన కెప్టెన్ సంజు శాంస‌న్ సైతం వెళ్లి పోయాడు. త‌ను ప్ర‌స్తుతం సీఎస్కే త‌ర‌పున ఆడ‌బోతున్నాయి. ఈ త‌రుణంలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ సెష‌న్ గురించి త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట పెట్టాడు జోస్ బ‌ట్ల‌ర్. త‌ను మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అత్యంత పెద్ద లీగ్ అని ప్ర‌శంస‌లు కురిపించాడు. దీనిని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో వర్ణించలేనని చెప్పాడు జోస్ బ‌ట్ల‌ర్. ఇక్కడ మీకు 7-స్టార్ హోటల్ స్థాయి సౌకర్యాలు, మీరు ఎక్కడికి వెళ్లాలనుకున్నా డ్రైవర్‌తో కూడిన కారు, అలాగే గుజరాత్ టైటాన్స్ జట్టులో మాకు అన్నీ స‌మ‌కూరుస్తోంద‌ని చెప్పాడు. ప్రపంచ స్థాయి ప్రాక్టీస్ సదుపాయాలు లభిస్తాయని తెలిపాడు. నిజం చెప్పాలంటే, మరే ఇతర లీగ్‌ను కూడా IPLతో పోల్చ లేమ‌న్నాడు జోస్ బ‌ట్ల‌ర్.

  • Related Posts

    ఇక ఎంఎస్ ధోనీ వార‌సుడు సంజు శాంస‌న్

    Spread the love

    Spread the loveరుతురాజ్ గైక్వాడ్ స్థానంలో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ చెన్నై : రేప‌టి నుంచి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభం కానుంది. దీంతో అంద‌రి క‌ళ్లు ఇప్పుడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ కు వెళ్లిన కేర‌ళ…

    కోచ్ గా అవ‌తారం ఎత్తిన హ‌ర్భ‌జ‌న్ సింగ్

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన భార‌త క్రిక‌ట్ బోర్డు ముంబై : భార‌త మాజీ క్రికెట‌ర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచ‌ల‌నంగా మారాడు. త‌ను గ‌త కొంత కాలంగా కామెంటేట‌ర్ గా, విశ్లేష‌కుడిగా ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *