రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో కేరళ స్టార్ క్రికెటర్
చెన్నై : రేపటి నుంచి ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో అందరి కళ్లు ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ పై పడ్డాయి. తను ఈ ఏడాది జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో హీరోగా మారాడు. 5 ఇన్నింగ్స్ లు ఆడి 321 రన్స్ తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. తన స్క్రైక్ రేట్ 200 కావడం విశేషం. ఈ తరుణంలో ఈనెల 30వ తేదీన తను కొన్నేళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన రాజస్తాన్ రాయల్స్ జట్టుతో తలపడనున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ తర్వాత ఎవరు సారథ్యం వహిస్తారనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
రాబోయే 5-7 మ్యాచ్‌లలో రుతురాజ్ గైక్వాడ్ రాణించక పోయినా, CSK కష్టాల్లోనే కొనసాగినా, IPL 2026లో సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టవచ్చని బలమైన వార్తలు వస్తున్నాయి.
భారీ అభిమాన గణం, బలమైన నాయకత్వ అనుభవంతో, ఎంఎస్ ధోని అనంతర శకంలో సంజు CSKకి ముఖ చిత్రంగా మారవచ్చని టాక్ . ఇది కేవలం వ్యూహాత్మక నిర్ణయం మాత్రమే కాదు, CSK తన తదుపరి దీర్ఘకాలిక నాయకుడు , పోస్టర్ బాయ్ కోసం వెతుకుతున్న తరుణంలో ఇది ఒక శక్తివంతమైన బ్రాండింగ్ ఎత్తుగడ కూడా అవుతుంది. ఇది జరిగితే, చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు .





