భారీ ఎత్తున పాల్గొన్న భక్త బాంధవులు
తిరుమల : శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమలలోని శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులకు కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం జరిగింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్త బాంధవులు పోటెత్తారు. మరో వైపు టీటీడీ ఆధ్వర్యంలో ప్రముఖ దేవాలయం తిరుపతి జిల్లాలోని ఒంటిమిట్టలో ఇవాల్టి నుంచి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోల్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి.
జేఈవో వి. వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ కోదండ రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇందు కోసం ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరో వైపు టీటీడీ చైర్మన్ ఇటీవలే ఒంటిమిట్టలో భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను సీఎం ఆదేశాలతో నిత్య అన్నదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇక తిరుమలలో జరిగిన న్నపన తిరుమంజనం కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్ద జీయర్ స్వామి, టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







