వేణు గానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం

Spread the love

అంగ‌రంగ వైభోపేతంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

ఒంటిమిట్ట : తిరుప‌తి జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం వేణు గానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్త జన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది.

భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఒంటిమిట్ట బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ ఏర్పాట్లు

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ రాష్ట్ర మంత్రులు అమ‌రావ‌తి : తిరుప‌తి జిల్లాలోని ఒంటిమిట్ట‌లో శ్రీకోదండ రామ‌స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభం అయ్యాయి. భారీ ఎత్తున భ‌క్తులు వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా…

    హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక

    Spread the love

    Spread the loveముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి కామెంట్ హైద‌రాబాద్ : గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యంతో జన జీవనం స్తంభించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *