ఆర్సీబీ గెలిచేనా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచేనా

ఐపీఎల్ 2026 మెగా టోర్న‌మెంట్ స్టార్ట్

బెంగ‌ళూరు : అస‌లైన మ‌జా ఏమిటో ఐపీఎల్ 2026 చూపించేందుకు సిద్ద‌మైంది. మార్చి 28న శ‌నివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ల‌ప‌డేందుకు రెడీ అయ్యింది. ఇరు జ‌ట్లు 25 సార్లు త‌ల‌ప‌డ్డాయి. 11 మ్యాచ్ ల‌లో ఆర్సీబీ గెలిస్తే ఎస్ ఆర్ హెచ్ 13 సార్లు పై చేయి సాధించింది. ఇక ఈ స్టేడియంలో ప‌రుగుల వ‌ర‌ద పార‌నుంది. ఏ జ‌ట్టు ముందు బ్యాటింగ్ చేసినా భారీగా స్కోర్ పెంచ‌డం ఖాయం. ఇక ఇరు జ‌ట్లు అన్ని విభాగాల‌లో బ‌లంగా ఉన్నాయి. దీంతో పోటీ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుందని క్రికెట్ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీనే ఆధిక్యంలో ఉంది గెలుపు ప‌రంగా చూస్తే. ఆ జ‌ట్టు 5 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించ‌గా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కేవ‌లం 3 మ్యాచ్ ల‌లో మాత్ర‌మే గెలుపొందింది. ఇక్కడ ఫలితాలు గత రికార్డుల కంటే ఎక్కువగా మ్యాచ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. చారిత్రకంగా స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ , జట్టు సమతుల్యత ఈ పోటీని హోరాహోరీగా మారుస్తాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (సి), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికె), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, సుయాష్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్: వెంకటేష్ అయ్యర్/ జాకబ్ డఫీ.

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (wk/c), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, శివమ్ మావి, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే. ఇంపాక్ట్ ప్లేయర్: అనికేత్ వర్మ/ ఎషాన్ మలింగ.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *