షాకింగ్ కామెంట్స్ చేసిన పాటిదార్
బెంగళూరు : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజిత్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026 లో భాగంగా తొలి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగింది. తను టాస్ గెలిచి ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేసింది. ఆ టీం కెప్టెన్ ఇషాన్ కిషన్ ఒక్కడే సత్తా చాటాడు. మిగతా వాళ్లంతా తేలి పోయారు. అనంతరం మైదానంలోకి దిగిన ఆర్సీబీ ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండానే పని పూర్తి కానిచ్చేసింది.
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తో పాటు దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. దీంతో నిర్దేశించిన ఎస్ఆర్ హెచ్ లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే పూర్తి చేసింది ఆర్సీబీ. అద్బుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న డఫీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో బెంగళూరు తొలి మ్యాచ్ లో బోణీ కొట్టింది. ఆర్సీబీ గత ఏడాది ఐపీఎల్ 2025 సీజన్ విజేతగా నిలిచింది. మ్యాచ్ గెలుపొందాక కెప్టెన్ రజత్ పాటిదార్ మీడియాతో మాట్లాడాడు. తాము మరోసారి ఛాంపియన్ గా నిలవాలని కోరుకుంటున్నామని, ఆ దిశగానే తాము ఆడతామని చెప్పాడు.






