సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం సంచలన ప్రకటన చేశారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని… ఈ 5 పిల్లర్లతో త్వరలో ‘ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ’ తీసుకు రావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. త్వరలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు పైన మంగళవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగస్వామి అయ్యేందుకు పలు బీమా సంస్థలు ముందుకు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. పీపీపీ విధానంలో చేపట్టదలచిన మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం చర్చించారు. వైద్యారోగ్య శాఖలో ఎక్కడా ఖాళీలు ఉండకూడదని స్పష్టం చేశారు సీఎం.
రేషనలైజేషన్ ద్వారా ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆదేశించారు. ఫార్మసీ నెట్వర్క్, ల్యాబొరేటరీ ఇంట్రిగ్రేషన్ జరగాలన్నారు. అనారోగ్య సమస్యలు, అత్యవసరవ వైద్య పరిస్థితులు, వైద్య బృందం సూచనల మేరకు మాత్రమే గర్భిణులకు ఇకపై సిజేరియన్లు చేయాలని, మిగిలిన సమయంలో నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 20 శాతానికి మించి సిజేరియన్లు జరిగితే ఆడిటింగ్ చేయాలన్నారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ పాల్గొన్నారు.





