రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ప్రాక్సీ సీఎం

బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌న్నారు. ఆయ‌న ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ప్రాక్సీ సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న పేరుతో రాచ‌రిక పాల‌న సాగిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

మేడిగడ్డలో పిల్లర్లు వాటంతట అవి కూలిపోలేద‌ని చెప్పారు. కానీ వాటిని కుట్ర పూరితంగా కూల్చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు వాటిని ఎందుకు రిపేర్ చేయడం లేదంటూ ప్ర‌శ్నించారు పోలవరం నుండి బనకచర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ అవ్వొద్దని, కావాలనే రిపేర్ చేయడం లేదని మండిప‌డ్డారు . ఒక ప్రాక్సీ ముఖ్యమంత్రిని చంద్రబాబు తెలంగాణలో పెట్టాడన్నారు. ఏపీ స‌ర్కార్
యదేచ్చగా నీళ్లు తరలించుకు పోతుంటే.. తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తోంద‌ని మండిప‌డ్డారు ఆర్ఎస్పీ. గ‌త రెండు ఏళ్ల‌లో ఇదే త‌తంగం కొన‌సాగుతూ వస్తోంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *