ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌లో గొడ‌వ‌పై

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. మంగ‌ళ‌వారం సీఐడీ నోటీసులు జారీ చేసింది. గ‌త జనవరి నెల 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో, ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ సంద‌ర్బంగా త‌న‌కు నోటీసులు ఇవ్వ‌డం ప‌ట్ల స్పందించారు కౌశిక్ రెడ్డి. తాను ఏ త‌ప్పు చేయ‌క పోయినా స‌ర్కార్ కావాల‌ని త‌న‌ను క‌క్ష సాధింపుల‌కు గురి చేస్తోంద‌ని ఆరోపించారు.

ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు, నా కుటుంబానికి, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు CID నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించింద‌న్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో ఇలా బెదిరింపులకు గురిచేయడం తగునా అని ప్ర‌శ్నించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ద‌మ్ముంటే త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా ఎదుర్కోవాల‌ని, కానీ ఇలా అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. చ‌ట్ట ప‌రంగా తాను తేల్చుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు చ‌ట్టం ప‌ట్ల గౌర‌వం ఉంద‌న్నారు ఎమ్మెల్యే. న‌న్ను ఇబ్బందుల‌కు గురి చేసినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా తాను వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *