హైద‌రాబాద్ లో జ‌య‌ల‌లిత నివాసం సీజ్

ప‌న్ను క‌ట్ట‌క పోవ‌డంతో జీహెచ్ఎంసీ షాక్

హైద‌రాబాద్ : త‌మిళ‌నాడు మాజీ సీఎం, దివంగత కుమారి జ‌య‌ల‌లిత‌కు చెందిన కుటుంబీకుల‌కు షాక్ త‌గిలింది. త‌న‌కు సంబంధించిన ఆస్తులు లెక్క‌లేన‌న్ని ఉన్నాయి. వీటిలో ఎక్కువ‌గా త‌మిళ‌నాడుతో పాటు హైద‌రాబాద్ లో ఉన్నాయి. తాజాగా త‌న నివాసానికి సంబంధించి హైద‌రాబాద్ లో ఉన్న ఇంటికి గాను ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటి ప‌న్ను చెల్లించ‌క పోవ‌డాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించి హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ). నోటీసులు ఇచ్చినా స్పందించ‌క పోవ‌డంతో చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిల కారణంగా జయలలిత హైదరాబాద్ నివాసం సీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

హైద‌రాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో, 8-3-1099/A అనే ​​ఇంటి నంబరుతో ఉన్న ఈ ఆస్తికి సంబంధించి, 2017 నుండి ఆస్తి పన్ను చెల్లించలేదని అధికారులు గుర్తించిన తర్వాత దీనిని సీజ్ చేశారు. ఈ బకాయిలకు సంబంధించి పలు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆ ఆస్తితో సంబంధం ఉన్న వ్యక్తుల నుండి ఎటువంటి స్పందన రాలేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపులు నిరంతరాయంగా నిలిచి పోవడంతో ఆ ఇంటిని సీజ్ చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *