నా ఇన్నింగ్స్ ను ధోనీకి అంకితం చేస్తున్నా

Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ముకుల్ చౌద‌రి

కోల్ క‌తా : యంగ్ క్రికెట‌ర్ ముకుల్ చౌద‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కోల్‌కతాపై ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌ను తన తండ్రికి, ఎంఎస్ ధోనీకి అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేవలం 27 బంతుల్లో 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. తన తండ్రి దలీప్ కుమార్ చౌదరి కన్న కలను నెరవేర్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, ధోనీ ఫినిషింగ్ స్టైల్‌ను చూస్తూ పెరిగానని, ఆయన స్ఫూర్తితోనే ఈ మ్యాచ్‌ను ముగించ గలిగానని చెప్పాడు మ్యాచ్ ముగిసిన అనంత‌రం. ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో కీల‌క‌మైన పోరులో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు అద్బుత విజ‌యాన్ని సాధించింది.

ఇరు జ‌ట్ల మ‌ధ్య ఆస‌క్తిర పోరు కొన‌సాగింది ఇరు జ‌ట్ల మ‌ధ్య‌. ముందుగా బ్యాటింగ్ కు దిగింది కోల్ క‌తా జ‌ట్టు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 182 ర‌న్స్ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. అనంత‌రం బ‌రిలోకి దిగింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. ఒకానొక ద‌శ‌లో ఓట‌మి అంచున ఉన్న ల‌క్నోకు ఊహించ‌ని రీతిలో విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు ముకుల్ చౌద‌రి. ఒకదశలో 128/7తో ఉన్న ఎల్‌ఎస్‌జీని ముకుల్‌ చౌదరి 27 బంతుల్లో 54 నాటౌట్ గా నిలిచాడు. 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో అసాధారణంగా పోరాడి ఒంటిచేత్తో గెలిపించాడు. అయూశ్‌ బదోని 34 బంతులో 54 ప‌రుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు 2 సిక్స్ లు కొట్టాడు.

  • Related Posts

    ఐపీఎల్ మెగా టోర్న‌మెంట్ లో వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డ్

    Spread the love

    Spread the love237 .31 స్ట్రైక్ రేట్ తో 776 ప‌రుగులు చేసిన యంగ్ క్రికెట‌ర్ బీహార్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో వండ‌ర్ కిడ్ వైబ‌వ్ సూర్య‌వంశీ అరుదైన రికార్డు సాధించాడు. త‌ను ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు.…

    చెన్నై సూప‌ర్ కింగ్స్ వైపు పాండ్యా చూపు

    Spread the love

    Spread the loveఇత‌ర జ‌ట్ల లోకి వెళ్లేందుకు నిరాక‌ర‌ణ ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టుకు చెందిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. త‌ను కీల‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ల‌లో ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే ఇండియ‌న్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *