ఇందు కోసం చట్టం కూడా తీసుకు వస్తున్నాం
అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ లో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఇదే క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా ప్రభావితం చేస్తోందని చెప్పారు. ఇందుకు గాను పెద్ద ఎత్తున చిన్నారులు, యువతీ యువకులు, విద్యార్థులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారన ఆందోళన వ్యక్తం చేశారు. తమ విలువైన కాలాన్ని, జీవితాన్ని కోల్పోతున్నట్లు తెలిపారు. ఇందుకు గాను కీలక సమావేశం నిర్వహించారు సహచర మంత్రులతో కలిసి .
ప్రధానంగా చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధివిధానాల తయారీ, చట్టం రూపకల్పనపై ఉండవల్లి నివాసంలో సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ప్రతినిధులు, అధికారులతో మా మంత్రుల బృందం సమావేశమైంది. పిల్లల సృజనాత్మకత దెబ్బతినకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉంచే చట్టం రూపొందించాలని అధికారులను ఆదేశించారు నారా లోకేష్. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని చెప్పారు. మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, జిఎడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఐ పీఆర్ డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్, ఐజీ ఆకే రవికృష్ణ, అదిరాజ్ సింగ్ రానా ఎస్పీ సైబర్ క్రైమ్, ఐ & పీఆర్ అధికారులు, సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు చట్టం విధి , విధానాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.





