వైశాఖి వేడుక‌ల కోసం కేటీఆర్ కు ఆహ్వానం

రావాల‌ని కోరిన గురుద్వారా క‌మిటీ
హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని అమీర్‌పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్ – వైశాఖి వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని గురుద్వారా ప్రతినిధులు శుక్ర‌వారం త‌న నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి ఆహ్వానించారు. అమీర్‌పేట్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ ఎస్. దర్శన్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం కేటీఆర్ ని, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు.ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా ఏప్రిల్ 14, మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు అమీర్‌పేట్‌లోని శ్రీ గురు గోవింద్ సింగ్‌జీ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ (మున్సిపల్ ప్లే గ్రౌండ్స్)లో జరగనున్న ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని వారు కోరారు. పంజాబ్ నుండి విచ్చేసిన ప్రముఖ మత ప్రచారకుల చేత గుర్బానీ కీర్తనలు , ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించ బడుతున్నాయని, ఈ వేడుకలకు సుమారు 8,000 నుండి 8,500 మంది భక్తులు హాజరవుతారని కమిటీ ప్రతినిధులు వివరించారు. సిక్కు సమాజం అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ పండుగలో పాల్గొని గురు సాహెబ్ ఆశీస్సులు తీసుకోవాలని వారు కేటీఆర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో గురుద్వారా సాహెబ్ అమీర్‌పేట్ కమిటీ సభ్యులు , ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *