శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం ప్ర‌త్యేక పాల‌సీ

Spread the love

తీసుకు వ‌స్తున్నామ‌న్న మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : ప్ర‌భుత్వ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం రాష్ట్ర కూట‌మి ప్ర‌భుత్వం ప్రత్యేక‌మైన పాల‌సీని తీసుకు వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత . అమ‌రావ‌తిలోని సచివాలయం బ్లాక్-2లో నిర్వహించిన లిటిగేషన్ పాలసీపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూఖ్ , వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ తో క‌లిసి హోం మంత్రి పాల్గొన్నారు.

ప్ర‌ధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కోర్టులలో పెండింగ్‌లో ఉన్న వివిధ న్యాయ వ్యవహారాలు , కేసుల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించడం జ‌రిగింద‌ని చెప్పారు అనిత వంగ‌ల‌పూడి. ​ముఖ్యంగా కేసుల పరిష్కారంలో సమయ పాలన పాటించడం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, సమగ్రమైన పాలసీ రూపకల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో మరింత న్యాయ పరమైన పారదర్శకతను, పనితీరులో సమర్థతను పెంపు పొందించే దిశగా ఈ లిటిగేషన్ పాలసీని బలోపేతం చేయాలని నిర్ణయించిన‌ట్లు వెల్ల‌డించారు.

  • Related Posts

    మినీ గోవాగా సూర్యలంక బీచ్ : చంద్ర‌బాబు నాయుడు

    Spread the love

    Spread the loveఏపీని ప‌ర్యాట‌క కేంద్రంగా మారుస్తామ‌ని ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీని టూరిజం హ‌బ్ గా మారుస్తామ‌న్నారు. ప్రతీ వ్యక్తికి సంక్షేమం, అభివృద్ది ఎలా అందుతోంది, అధికారులు ప్రజలతో…

    తెలంగాణ ఆర్టీసీలో త్వ‌ర‌లో పోస్టుల భ‌ర్తీ

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హైద‌రాబాద్ : నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు రాష్ట్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ప్రజా పాలన ప్రభుత్వం మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *