చంద‌నోత్స‌వ వేడుక‌ల‌కు భారీ ఏర్పాట్లు

VijayaBhaskar · April 12, 2026
Spread the love

చేయాల‌ని ఆదేశించిన మంత్రి వంగ‌ల‌పూడి

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ముఖ పుణ్య క్షేత్ర‌మైన
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీన నిజరూప దర్శనం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వంగ‌ల‌పూడి అనిత‌. విశాఖ కలెక్టరేట్‌లో సహచర మంత్రులు డోలా వీరాంజ‌నేయ స్వామి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డితో పాటు జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీల‌తో క‌లిసి సమీక్ష చేప‌ట్టారు.

లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం క్యూ లైన్లు, తాగునీరు, రవాణా ,పటిష్టమైన భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల సమన్వయంతో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది క‌లిగినా ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే ఏర్పాట్ల‌పై స‌మీక్ష చేప‌ట్టామ‌ని తెలిపారు వంగ‌ల‌పూడి అనిత‌.