త‌మిళ‌నాట మ‌రోసారి మాదే అధికారం

Spread the love

నిప్పులు చెరిగిన ఉద‌య‌నిధి స్టాలిన్

చెన్నై : ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా ప్ర‌జ‌లు త‌మ వైపు ఉన్నార‌ని ధీమా వ్య‌క్తం చేశారు డీఎంకే పార్టీ యువ నేత‌, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ఈరోజు మన్నార్గుడిలో ఫాదర్ పెరియార్ విగ్రహం వద్ద ఉదయించే సూర్యుని చిహ్నం కింద ప్ర‌సంగించారు. భారీ ఎత్తున జ‌నం పోగ‌య్యారు. ఫుల్ జోష్ నింపారు త‌న మాట‌ల తూటాల‌తో. ప్ర‌ధానంగా అన్నాడీఎంకే, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌తో పాటు కొత్త‌గా పార్టీ స్తాపించిన టీవీకే విజ‌య్ ను కూడా ఏకి పారేశారు. వారికి అంత సీన్ లేద‌న్నారు.

సీఎం ఎంకే స్టాలిన్ సార‌థ్యంలోని డీఎంకే ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌లు సానుకూల దృక్ఫ‌థంతో ఉన్నార‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఐదేళ్ల ద్రావిడ నమూనా పాలనలో మన్నాను అత్యున్నత విజయాలతో ‘ప్రకాశవంతమైన’ రాజుగా తీర్చిదిద్దడానికి తాము చేసిన కృషి స్పష్టంగా క‌నిపిస్తోంద‌ని చెప్పాడు. ద్రావిడ నమూనా 2.0లో అమలు చేయబోయే వాగ్దానాల గురించి తెలియ చేశారు ఉద‌య‌నిధి స్టాలిన్. బానిసత్వం, ద్రోహానికి పేరుగాంచిన ఎన్డీఏ కూటమిని ఓడించి, ఆ ముగ్గురు తమిళ పండితుల జన్మ స్థలమైన తిరువారూరు నేల నుండి లౌకిక ప్రగతిశీల కూటమి విజయాన్ని ఖాయం చేస్తామని సగ‌ర్వంగా ప్ర‌క‌టించారు యువ‌నేత‌.

  • Related Posts

    త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు

    Spread the love

    Spread the loveరెండు రోజుల పాటు క్యాంపెయిన్ అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే, ఎన్డీయే కూట‌మి త‌ర‌పున బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం చేయానున్నారు. ఈనెల 23వ తేదీన ఎన్నిక‌లకు సంబంధించి…

    అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    Spread the love

    Spread the loveకాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్ అన‌కాప‌ల్లి జిల్లా : అనకాపల్లి జిల్లాలో ఆదివారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ప్రవేటు ట్రావెల్ బస్.బస్సు ప్రమాదం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *