Friday, 16 October 2026

అమ‌రావ‌తి రైతుల‌కు అన్యాయ జ‌ర‌గ‌దు

newsseals-APCM

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల‌కు సంబంధించి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. స్వ‌చ్చంధంగా త‌మ భూముల‌ను ఇచ్చిన వారికి మేలు జ‌రిగేలా చూస్తామ‌న్నారు. అమ‌రావ‌తి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగనివ్వను అని ప్ర‌క‌టించారు. రెండో విడత భూ సమీకరణ రైతులకు అండగా నిలిచారు సీఎం.

ఏడాదికి ఇచ్చే కౌలు రూ.30,000 నుండి రూ.40,000కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అన్న‌దాత‌ల‌కు తీపి క‌బురు చెప్పారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది లేకుండా చేస్తామ‌న్నారు. ప్రతి ఏటా రూ.3,000 చొప్పున కౌలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. రాబోయే 10 ఏళ్ల పాటు రైతులకు కౌలు చెల్లింపు జ‌రుగుతుంద‌ని చెప్పారు. రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీకి ఆమోదం తెలిపామ‌న్నారు సీఎం. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణంలో భాగస్వాములైన రైతులకు ఎప్పటికీ అన్యాయం జరగనివ్వమని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *