Friday, 16 October 2026

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

newsseals-BusAccident

కాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్

అన‌కాప‌ల్లి జిల్లా : అనకాపల్లి జిల్లాలో ఆదివారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ప్రవేటు ట్రావెల్ బస్.బస్సు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ప్ర‌యాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో కొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌లో 12 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి హాస్పిటల్ కు త‌ర‌లించారు స్థానికులు.

ట్రావెల్ బ‌స్సు చెన్నై నుండి భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తు కారణంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడడంతో భారీ ఎత్తున నిలిచి పోయాయి వాహనాలు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు నక్కపల్లి పోలీసులు. ప్రయాణికులు చాలా మంది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *