టీటీడీ ప్రాణ దాన ట్రస్టుకు రూ. కోటి విరాళం
దానం చేసిన హైదరాబాద్ భక్తుడు
తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే తిరుమల లో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన భక్తుడు భారీ విరాళం అందించారు. శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్, గుండె, మూత్ర పిండాలు, మెదడు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేద రోగులకు ఉచిత వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పని చేస్తుంది. సోమవారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) ‘శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్’కు రూ. 1 కోటి కంటే ఎక్కువ మొత్తాన్ని విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో, TTD అదనపు కార్యనిర్వహణాధికారి (AEO) సి. వెంకయ్య చౌదరికి ఈ విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను అందజేశారు.
TTD వెబ్‌సైట్ సమాచారం ప్రకారం హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘వర్మ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అల్లూరి వర్మ ఈ విరాళాన్ని సమర్పించారు. నవంబర్ 2001లో స్థాపించబడిన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్, గుండె, మూత్ర పిండాలు, మెదడు, క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేద రోగులకు ఎటువంటి రుసుము లేకుండా ఉచిత వైద్య సేవలను అందించడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్బంగా భారీ విరాళాన్ని అందించిన దాతను అభినందించారు చౌదరి.