ప్ర‌చారంలో దూసుకు పోతున్న టీవీకే విజ‌య్

VijayaBhaskar · April 18, 2026
Spread the love

అధికార పార్టీని ఏకి పారేస్తున్న త‌మిళ ద‌ళ‌ప‌తి

చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో కొత్త‌గా పార్టీ పెట్ట‌డ‌మే కాకుండా అధికార పార్టీలో క‌ల‌కలం రేపిన టీవీకే విజ‌య్ ఉన్న‌ట్టుండి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో తాము పోటీకి దింపుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. చెప్పిన ప్ర‌కారం త‌ను అంద‌రినీ నిల‌బెట్టాడు. విచిత్రం ఏమిటంటే సామాన్యులు, ఇత‌ర అన్ని వ‌ర్గాల‌కు, సామాజిక కులాల‌కు కూడా ప్ర‌యారిటీ ఇచ్చాడు విజ‌య్. ఇక ప్ర‌చారాన్ని వినూత్నంగా చేస్తున్నాడు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేస్తున్నాడు. మ‌రో వైపు డీఎంకేతో పాటు అన్నా డీఎంకే పార్టీలు సైతం కూడా క్యాంపెయిన్ లో పాల్గొంటున్నాయి. కానీ ఆశించిన మేర అన్నాడీఎంకే పేరు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

ఈ త‌రుణంలో టీవీకే విజ‌య్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. తాజాగా రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాల ప్రకారం రాష్ట్రంలో 1.25 కోట్ల ఓట్ల‌ను సాధిస్తుంద‌ని అంచ‌నా. ఒక కొత్త పార్టీకి ఇది నిజంగానే భారీ విజ‌యంగా పేర్కొంటున్నారు. ఏది ఏమైనా టీవీకే విజ‌య్ ఇంపాక్ట్ త‌ప్ప‌కుండా ఉంటుంద‌న్న‌ది వాస్త‌వం. ఈసారి ప‌వ‌ర్ లోకి రాలేక పోయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వానికి ప‌క్క‌లో బల్లెంలా త‌యారైంది. దీంతో స్వ‌యంగా డీఎంకే పార్టీ చీఫ్ , సీఎం ఎంకే స్టాలిన్ ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లిసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ త‌రుణంలో విజిల్ వేస్తూ ముందుకు సాగుతున్నాడు విజ‌య్.