త‌మిళ‌నాడులో టీవీకే విజ‌య్ ప్ర‌భావం లేదు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కె. అన్నామ‌లై

కోయంబ‌త్తూరు : బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న అధికారంలో ఉన్న డీఎంకేను, కొత్త‌గా పార్టీ పెట్టిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ ను ఏకి పారేశారు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు రాష్ట్ర శాస‌న స‌భ‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఈసారి టీవీకే అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్ప‌టికే సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు విజ‌య్. నిశ్శ‌బ్దంగా క్యాంపెయిన్ చేస్తూ యూత్ ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. అనూహ్యంగా త‌న వ‌ద్ద డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తున్న త‌న కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. అంద‌రినీ విస్తు పోయేలా చేశాడు. విజ‌య్ ప్ర‌ధానంగా డీఎంకే పార్టీని, అవినీతి, అక్ర‌మాల‌ను ప్ర‌శ్నిస్తున్నాడు. మ‌రో వైపు కేంద్రాన్ని కూడా వ‌ద‌ల‌డం లేదు.

ఈ సంద‌ర్భంగా డీఎంకే, టీవీకేతో పాటు అన్నాడీఎంకే , బీజేపీ ఎన్డీయే కూట‌మి ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య పోరు కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో జ‌రిగిన ప్ర‌చారంలో బీజేపీ సీనియ‌ర్ నేత కె. అన్నామ‌లై ప్ర‌సంగించారు. భారీ జ‌న‌సందోహాన్ని ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో టీవీకే విజ‌య్ ప్ర‌భావం లేద‌న్నారు. ఈనెల 23న జ‌రిగే ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే ఎన్డీయే కూట‌మి త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *