బావ‌కు బామ్మ‌ర్ది బాల‌య్య బ‌ర్త్ డే విషెస్

VijayaBhaskar · April 20, 2026
Spread the love

ఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు పుట్టిన రోజు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సంద‌ర్బంగా ప్ర‌ముఖ న‌టుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ శాస‌న స‌భ్యులు నంద‌మూరి బాల‌య్య శుభాకాంక్ష‌లు తెలిపారు. దూరదృష్టి, దృఢ సంకల్పం, అభివృద్ధి పట్ల అంకితభావం ఇవే మీ నాయకత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మీరు చేస్తున్న నిరంతర కృషి ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుంద‌ని, ఇందులో ఎలాంటి సందేహం అక్క‌ర్లేద‌న్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న మీ విజన్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్ర‌శంస‌లు కురిపించారు నంద‌మూరి బాలకృష్ణ‌. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత పురోగతి సాధించాలని, మీకు ఆయురారోగ్యాలు కలగాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాన‌ని పేర్కొన్నారు .
ఇంకా ఎన్నో సంవత్సరాలు అదే ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు బాల‌య్య‌. మీరు మా బావ గారైనందుకు ఆనందంగా ఉంద‌న్నారు.