సీఎం చంద్ర‌బాబుకు టీటీడీ అర్చ‌కుల ఆశీర్వాదం

VijayaBhaskar · April 20, 2026
Spread the love

ఏప్రిల్ 20వ తేదీన ముఖ్య‌మంత్రి పుట్టిన రోజు

అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ‌. సుదీర్ఘ‌మైన రాజ‌కీయ నేప‌థ్యం క‌లిగిన చ‌రిత్ర‌. 40 ఏళ్ల‌కు పైగా కంటిన్యూగా ప‌నిచేస్తున్నారు. సీఎం బ‌ర్త్ డే సంద‌ర్బంగా చంద్ర‌బాబు నాయుడుకు తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) , శ్రీ క‌న‌క‌దుర్గ గుడి అర్చ‌కుల ఆశీర్వ‌చ‌నం చేశారు. పుట్టిన రోజు సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ, దుర్గగుడి పండితులు. ముఖ్యమంత్రికి వేంకటేశ్వరస్వామి, దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ప్రసాదం, చిత్రపటాలను అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి, దుర్గగుడి ఈఓ శీనా నాయక్ పాల్గొన్నారు. ఈసంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలియ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ముఖ్య‌మంత్రిగా త‌న‌కు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చినందుకు తాను ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటాన‌ని పేర్కొన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.