newsseals.com
DEVOTIONAL

ఘనంగా చంద్రన్న జన్మదిన వేడుకలు

VijayaBhaskar April 20, 2026
newsseals-Savitha
Spread the love

భారీ ఎత్తున హాజ‌రైన టీడీపీ కార్య‌క‌ర్త‌లు

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌ఘ‌నంగా వేడుక‌లు చేప‌ట్టారు. ప‌లువురు నేత‌లు కేక్ లు కోసి స్వీట్లు పంపిణీ చేస్తే మ‌రికొంద‌రు ఆయా ఆస్ప‌త్రుల‌లో రోగుల‌కు పండ్లు అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా శ్రీ స‌త్య‌సాయి జిల్లాలోని పెనుకొండ‌లో ఘ‌నంగా నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు వేడుక‌లు చేప‌ట్టారు. పెనుకొండ నియోజక వర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మంత్రి ఎస్. సవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ముందుగా పెద్ద చెరువు కట్ట ఆంజనేయ స్వామి దేవాలయం ఎదుట 76 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలనలో ఒడిదుడుకులు ఎదుర్కునేలా సీఎం చంద్రబాబుకు శక్తిని ఇవ్వాలంటూ ఆంజనేయస్వామిని మంత్రి సవిత కోరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా కియా పరిశ్రమ వరకు వెళ్లారు. అక్కడ 76 కేజీల భారీ కేక్ ను కూటమి నాయకులు, కార్యకర్తలతో మంత్రి సవిత కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి స‌విత మాట్లాడుతూ ఏపీలో జ‌గ‌న్ రెడ్డి చాప్ట‌ర్ క్లోజ్ అన్నారు. ఆయ‌న ఇక ప‌వ‌ర్ లోకి రార‌న్నారు.