28న విశాఖ‌లో గూగుల్ డేటా సెంట‌ర్ కు శంకుస్థాప‌న

VijayaBhaskar · April 26, 2026
Spread the love

వెల్ల‌డించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈనెల 28న విశాఖ‌ప‌ట్నంలో టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ డేటా సెంట‌ర్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం చేయటం ద్వారా దేశానికి టెక్ క్యాపిటల్ ను ఏర్పాటు చేయగలిగాం అన్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం దక్కిందని చెప్పారు సీఎం. ఫ్యూచర్ సిటీగా గ్రీన్, బ్లూ సిటీ, నెట్ జీరో కాన్సెప్టుతో హైదరాబాద్ ప్లస్ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం అని ప్ర‌క‌టించారు.

సంస్కరణలు సంపదను సృష్టిస్తాయని అభిప్రాయ‌ప‌డ్డారు. రెవెన్యూ వస్తేనే సంక్షేమం చేయగలం అని చెప్పారు సీఎం. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కీలకమైన అంశం అని పేర్కొన్నారు. మన సమాజం కేవలం మిలియనీర్లు, బిలియనీర్ల కోసం మాత్రమే కాదు. సాధారణ ప్రజలది కూడా అని స్ప‌ష్టం చేశారు.
అందుకే పీ4 పేరిట వారిని ఆదుకునేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమానికి కూడా రూపకల్పన చేశాం అన్నారు.
సమాజంలో ప్రతీ ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందాలి. ఆ కోణంలోనే మా చర్యలు ఉంటాయ‌న్నారు సీఎం. భారత్ కు అత్యుత్తమ పెర్ఫార్మర్- రిఫార్మర్ గా ప్రధాని మోదీ ఉన్నారన్నారు.