కోహ్లీ లాంటి ఆటగాడు మళ్లీ రాడు : దినేష్ కార్తీక్

VijayaBhaskar · May 3, 2026
Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్

చెన్నై : టీ20 క్రికెట్ ఎదుగుతున్న తీరుపై టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్, టీ20లకు కావాల్సిన నైపుణ్యాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయ‌ని పేర్కొన్నాడు, అందుకే భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లను చూడటం చాలా క‌ష్టంగా ఉంటుంద‌న్నాడు . అయితే నేను మీకు ప్రామిస్ చేసి చెప్పగలను.. విరాట్ కోహ్లీ లాంటి ఆల్‌ ఫార్మాట్ ప్లేయర్ మళ్లీ రాడు అని ప్ర‌శంస‌లు కురిపించాడు దినేష్ కార్తీక్. అని కార్తీక్ పేర్కొన్నారు. నేటి తరం ఆటగాళ్లు ఏదో ఒక ఫార్మాట్‌కే పరిమితమవుతున్న ఈ తరుణంలో కోహ్లీ సాధించిన ఘనతలు అసాధారణమని ఆయన కొనియాడారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ప్రపంచ క్రికెట్ లో టాప్ లో కొన‌సాగుతున్న ఏకైక ఆట‌గాడు విరాట్ కోహ్లీ అని , త‌న ద‌రిదాపుల్లోకి రావాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌న్నారు. ఇదే క్ర‌మంలో త‌ను క్రికెట్ లో అరుదైన మూడు ఫార్మాట్ ల‌లో కీల‌క‌మైన ఆట‌గాడిగా మారి పోయాడ‌ని, ప‌రుగుల వ‌ర‌ద పారించ‌డంలో త‌న‌కు త‌నే సాటి అని ప్ర‌శంసించారు దినేష్ కార్తీక్. త‌ను రోజు రోజుకు త‌న ఫామ్ ను కొన‌సాగిస్తూనే ముందుకు సాగుతున్నాడ‌ని , ఇలాంటి ఆట‌గాళ్లు ఇండియాలో దొర‌క‌డం భ‌విష్య‌త్తులో చూడ‌లేమ‌న్నాడు.