ఇది ఊహించ‌ని అపజ‌యం : హార్దిక్ పాండ్యా

VijayaBhaskar · May 3, 2026
Spread the love

మ‌రోసారి సీఎస్కే చేతిలో ఓట‌మిపై కామెంట్స్

చెన్నై : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో మ‌రోసారి ఓట‌మి పాలైంది హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్. తొలుత ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన పోరులో భారీ తేడాతో ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్ లో సూప‌ర్ సెంచ‌రీ చేశాడు సంజు శాంస‌న్. చెన్నై బౌల‌ర్ల దెబ్బ‌కు 104 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. తాజాగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన మ‌రో మ్యాచ్ లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసింది ముంబై ఇండియ‌న్స్ . నిర్ణీత 20 ఓవర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి కేవ‌లం 159 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

అనంత‌రం బ‌రిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి 18.4 ఓవ‌ర్ల‌లో ప‌ని పూర్తి చేసింది. 160 ర‌న్స్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కార్తీక్ కార్తీక్ లు సూప‌ర్ షో చేశారు. రుతురాజ్ 67 ర‌న్స్ తో నాటౌట్ గా నిల‌వ‌గా కార్తీక్ శ‌ర్మ 57 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. ఇక ఎప్ప‌టి లాగే సంజు శాంస‌న్ నిరాశ ప‌రిచాడు. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 2 సెంచ‌రీల‌తో స‌రి పెట్టుకున్నాడు. మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మి పాలు కావ‌డం ప‌ట్ల స్పందించాడు హార్దిక్ పాండ్యా. వ‌రుస‌గా ఓట‌మి పాలు కావ‌డం ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నాడు. మా ఆట తీరు మార్చు కోవాల్సి ఉంద‌న్నాడు.