టీవీకేకు మ‌ద్ద‌తు హైక‌మాండ్ నిర్ణ‌యం

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్

పుదుచ్ఏచ‌రి : త‌మిళ‌నాడులో టీవీకే విజ‌య్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప‌ట్ల స్పందించారు, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. మా పార్టీ తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే, బీజేపీ శక్తులను అధికారం నుండి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు . మా ఏకైక లక్ష్యం అదే. అంతిమంగా, లౌకిక శక్తులు బలోపేతం కావాలని తాము కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

పుదుచ్చేరి ఎన్నికల్లో పార్టీ పనితీరుపై ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో తాము రాజకీయ పరిస్థితులను చక్కదిద్దుతామని పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా తీసుకున్నామని మాకు తెలుసు అని చెప్పారు డికే శివ‌కుమార్. కచ్చితంగా, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా,తాము పరిస్థితులను పునరుద్ధరించి, భవిష్యత్తులో సరైన రాజకీయ వ్యూహరచన చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు . ఇదిలా ఉండ‌గా తాజాగా త‌మిళ‌నాడులో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో టీవీకే పార్టీ 108 స్థానాల‌ను సాధించింది. కాంగ్రెస్ పార్టీ , వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐసీయుఎంఎల్ పార్టీలు మ‌ద్ద‌తు ఇచ్చాయి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *