అమ్మకు ఎదురు లేదు తిరుగు లేదు

VijayaBhaskar · May 10, 2026
Spread the love

ఇవాళ త‌ల్లుల దినోత్స‌వం సంద‌ర్బంగా

అమ‌రావ‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా అంత‌ర్జాతీయ త‌ల్లుల దినోత్స‌వం. ఈ సంద‌ర్బంగా స్పందించారు లోకేష్. కనిపించే ప్రతి స్త్రీ.. కని పెంచిన అమ్మతో సమానం అన్నారు. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ, ఎవ్వరూ చేయ‌లేర‌న్నారు. ఇదే ప్రతి అమ్మ కోరుకునే కానుక. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం, స్త్రీ పురుషులు సమానం అనే భావన నాలో పెంపొందించింది అమ్మ. నా తల్లి స్ఫూర్తి తోనే విద్యా శాఖలో నైతిక విలువల పాఠాలు ప్రవేశ పెట్టాం అన్నారు.

మహిళా సాధికారత లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామ‌న్నారు. దీపం 2 పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న‌ట్లు తెలిపారు నారా లోకేష్‌. బిడ్డలకు గురువు, దైవం, మార్గదర్శి రూపంలో అన్నీ తానైన మాతృ మూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియ చేశారు. లవ్ యూ అమ్మా అంటూ త‌న త‌ల్లి నారా భువ‌నేశ్వ‌రి గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌ల్లిని మించిన దైవం లేద‌న్నారు నారా లోకేష్‌.