ఐపీఎల్ లో చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ

VijayaBhaskar · May 10, 2026
Spread the love

అతి త‌క్కువ స‌మ‌యంలో ఏకంగా 100 సిక్స‌ర్లు

జైపూర్ : రాహుల్ ద్ర‌విడ్ ఏ ముహూర్తాన త‌న‌ను తీసుకున్నాడో కానీ వండ‌ర్స్ క్రియేట్ చేస్తున్నాడు అత్యంత పిన్న వ‌య‌సు క‌లిగిన వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను వ‌చ్చీ రావ‌డంతోనే దుమ్ము రేపుతున్నాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డుతూ ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు పెట్టిస్తున్నాడు. తాజాగా జైపూర్ లోని స‌వాయి మాన్ సింగ్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఎప్ప‌టి లాగే ఫోర్లు, సిక్స‌ర్ల‌తో దంచి కొట్టాడు. త‌ను 16 బంతులు ఆడి 3 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 36 ప‌రుగులు చేశాడు.

అంతే కాదు వైభ‌వ్ సూర్య వంశీ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) చ‌రిత్ర‌లో అతి త‌క్కువ స‌మ‌యంలో 100 సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా నిలిచాడు. ఈ ఘ‌న‌త సాధించిన పిన్న వ‌య‌స్కుడిగా 15 ఏళ్ల సూర్య‌వంశీ హిస్ట‌రీ క్రియేట్ చేశాడు. 515 బంతుల్లో అతను ఈ మార్కు అందుకొని కరణ్‌బీర్‌ సింగ్‌ (813 బంతులు) రికార్డు బ్రేక్‌ చేశాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ చేసింది గ‌జ‌రాత్ టైటాన్స్ . నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 229 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ 152 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది.