newsseals.com
SPORTS

ఉర్విల్ ప‌టేల్ ఇన్సింగ్స్ అద్భుతం

VijayaBhaskar May 11, 2026
newsseals-SanjuSamson
Spread the love

ప్ర‌శంసలు కురిపించిన సంజు సాంస‌న్

చెన్నై : చెన్నై వేదిక‌గా జ‌రిగిన తాజా కీల‌క లీగ్ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను మ‌ట్టిక‌రిపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 203 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన సీఎఎస్కే ఊహించ‌ని రీతిలో 19.2 బంతుల్లోనే టార్గెట్ ను పూర్తి చేసింది. ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన ఉర్విల్ ప‌టేల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ల‌క్నో బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఒకానొక ద‌శ‌లో ఏమీ చేయాలో పాలుపోక నిశ్చేష్టంగా ఉండి పోయారు. త‌ను కేవ‌లం 13 బంతుల్లో హాఫ్ సెంచీర చేశాడు. ఇక 23 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 8 భారీ సిక్స‌ర్ల‌తో 65 ర‌న్స్ చేసి రికార్డు సృష్టించాడు.

ఈ సంద‌ర్బంగా ఉర్విల్ ప‌టేల్ ఇన్నింగ్స్ గురించి స్పందించాడు స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్.
నిజం చెప్పాలంటే, ఉర్విల్ పటేల్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పవర్-హిట్టింగ్ చేసే ఆటగాళ్లను నేను చాలా మందిని చూశాను, కానీ బంతిని ఈ విధంగా బాదే వారిని నేను చాలా అరుదుగా చూశాను. సిక్సర్లు బాదడంలో ఉర్విల్ పటేల్‌కు ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది. అతను అత్యద్భుతంగా ఆడాడు. రాబోయే మ్యాచ్‌లలో కూడా ఉర్విల్ పటేల్ ఇదే విధంగా ఆడుతూ, జట్టుకు ఇదే రీతిలో సహాయ పడతాడని నేను ఆశిస్తున్నానని అన్నాడు సంజు శాంస‌న్.