సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉంటాడా..?

వచ్చే సీజ‌న్ లో త‌ను ప‌ని చేసేది క‌ష్ట‌మే

చెన్నై : ఐపీఎల్ 19 సీజ‌న్ నుంచి దాదాపు నిష్క్ర‌మించేందుకు రెడీ అయ్యింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు. ఆ జ‌ట్టు ఆశించిన మేర రాణించ లేక పోయింది. ప్ర‌ధానంగా అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. దేశంలో అత్య‌ధిక ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగిన ఏకైక జ‌ట్టు సీఎస్కే. కానీ ఆ జ‌ట్టుకు పెద్ద దెబ్బ మ‌హేంద్ర సింగ్ ధోనీ లేక పోవ‌డం. త‌ను ఆట నుంచి నిష్క్ర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. త‌న వార‌సుడిగా ముందే సీఎస్కే మేనేజ్మెంట్ సంజు శాంస‌న్ ను రూ. 18 కోట్ల‌కు తీసుకుంది. కానీ త‌ను కూడా అస‌లైన మ్యాచ్ ల‌లో చేతులెత్తేశాడు. త‌ను ఆడితేనే జ‌ట్టు గెలిచింది. ఇక చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో అన‌వ‌స‌ర షాట్ ఆడేందుకు పోయి వికెట్ పారేసుకున్నాడు. అద‌నంగా మ‌రో 40 లేదా 50 ప‌రుగులు చేసి ఉంటే చెన్నై గెలిచేది.

ఇక తాజాగా నివేదికల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు ఇదే చివరి సీజన్ కావ‌చ్చు. ఫ్లెమింగ్ కోచింగ్ పట్ల CSK యాజమాన్యం సంతృప్తిగా లేదు. వచ్చే సీజన్‌కు ముందే, CSK జట్టు యాజమాన్యం జట్టు కోసం ఒక కొత్త కోచ్‌ను నియమించనుంది . అంతే కాదు వచ్చే సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ బహుశా CSK కెప్టెన్‌గా కొనసాగక పోవచ్చు. జట్టు కెప్టెన్‌గా ఒక అనుభవజ్ఞుడైన కొత్త ఆటగాడిని నియమించనున్నారు. వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయ్యే రేసులో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఆటగాడు సంజు శాంసన్. కెప్టెన్సీకి భారతీయ ఆటగాడి కోటాలో సంజు శాంసన్ ఎంపికయ్యే బలమైన అవకాశం ఉంది ధోని క్రికెట్ నుండి పూర్తిగా విరమణ తీసుకున్నారు, కాబట్టి వచ్చే సీజన్ IPLలో ఆయన ఆడరు. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కు ఒక పెద్ద ఎదురు దెబ్బ.

  • Related Posts

    తెలంగాణ‌లో రూ. 30 కోట్ల‌తో క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న

    హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వ‌హ‌ణ‌ను కేటాయించ‌డం ప‌ట్ల పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల‌ కల్పన జరిగిందన్నారు.…

    మేధావి బిధూరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్

    ఢిల్లీ : మ‌హిళా క్రికెట్ రంగంలో మ‌రో తార వెలుగులోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేష‌న్ గా మారారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. త‌ను అనుకోకుండా చేసిన హావ‌భావాల‌తో కూడిన వీడియోలు ఇప్పుడు చ‌క్క‌ర్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *