పార‌ద‌ర్శ‌క పాల‌న‌కే సీఎం ప్రాధాన్య‌త

స్ప‌ష్టం చేసిన మంత్రి అధ‌వ అర్జున

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర మంత్రి అధ‌వ అర్జున బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పున‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌జ‌లకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు చెప్పారు. అంతే కాదు సంక్షేమం, అభివృద్ది వైపు ప‌రుగులు పెట్టించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టికే పాల‌నా ప‌రంగా ప్ర‌క్షాళ‌న ప్రార‌భించిన‌ట్లు తెలిపారు అధ‌వ అర్జున‌. ముఖ్యమంత్రి జోసెఫ్ విజ‌య్ మంత్రివర్గం ఒకే కుటుంబంలా పనిచేయాలని ఆశిస్తున్నారని చెప్పారు.

తమకు మద్దతు తెలిపిన పార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరుకుంటున్నారని అన్నారు. ప్రజల తీర్పుకు విరుద్ధంగా DMK , AIADMK కూటమి ఏర్పాటుకు ప్రయత్నించాయ‌ని ఆరోపించారు. ఎన్నికల సమయంలో, AIADMK బీజేపీ నియంత్రణలో ఉందని DMK పేర్కొందన్నారు. కానీ ఆ తర్వాత తన సొంత సిద్ధాంతాన్ని విస్మరించి, AIADMKతో పొత్తు చర్చలు జరిపిందన్నారు. ఈ విష‌యాన్ని జ‌నం గుర్తించార‌ని చెప్పారు మంత్రి. రాజ్యాంగ వ్యవస్థను పరిరక్షించేందుకు కాంగ్రెస్ ,వామపక్ష పార్టీలు ఒకే వేదికపై ఏకమయ్యాయని తెలిపారు. అన్నాడీఎంకేతో స్నేహ పూర్వ‌కంగా క‌లిసి ప‌ని చేస్తామ‌న్నారు .

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *