Friday, 16 October 2026

నిర్దేశించిన పనులకే అనుమతులు

newsseals-APNGRA

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సాంకేతికత ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా, ఆయా గ్రామాల్లోని రోడ్లను ఇతర ముఖ్య ప్రాంతాల రోడ్లతో సులభంగా అనుసంధానం చేయవచ్చన్నారు. ప్రజలు కూడా రోడ్ల ప్రస్తుత స్థితిగతులను ఆన్‌లైన్ ద్వారా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధి హామీ నిధులను ప్రభుత్వ నిర్దేశించిన బడ్జెట్ పరిమితి వరకే జిల్లా కలెక్టర్లు మంజూరు చేయాలని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం. అంతకు మించి అదనంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వ లెక్కలకు, క్షేత్రస్థాయి ఖర్చులకు పొంతన లేకుండా పోయి నిధుల దుర్వినియోగానికి, ఆడిట్ ఇబ్బందులకు దారి తీస్తుంద‌న్నారు.

అలాగే ఉపాధి హామీ మార్గదర్శకాల ప్రకారం అనుమతించిన పనులను మాత్రమే గ్రామాల్లో చేపట్టాలని ఆదేశించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప్రభుత్వ నిబంధనల జాబితాలో లేని ఎలాంటి ఇతర పనులను ఉపాధి హామీ కింద చేయడానికి వీలు లేదన్నారు. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ రామ్ జీ) చట్టాన్ని స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో పనులను సమర్థవంతంగా చేపట్టేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాల”ని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *