వ‌డ‌గాల్పుల ప‌ట్ల‌ ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి

సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ

హైద‌రాబ‌ద్‌: తీవ్ర‌మైన వ‌డ గాలులు, ఎండ తీవ్ర‌త‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ నున్నందున ఆయా జిల్లాల అధికారులు అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు త‌గిన సంఖ్య‌లో అందుబాటులో ఉంచాల‌ని, తాగు నీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు మొద‌లు జిల్లా ఆసుప‌త్రుల వ‌ర‌కు వైద్యారోగ్య సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

వ‌డ‌దెబ్బ‌తో ఎవ‌రైనా ఆసుప‌త్రుల్లో చేరితే త‌గిన వైద్య స‌హాయం అందించాల‌ని సీఎం ఆదేశించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో చ‌లివేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు మ‌ధ్యాహ్నం ప్ర‌యాణాలు చేయ‌కుండా ఉండాల‌ని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ క‌లెక్ట‌ర్ల‌కు దిశా నిర్దేశం చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేర‌కు సీఎస్ ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *